కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తమకు టచ్ లో ఉన్నాడని బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు స్వయంగా వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమన్నారో నాకు తెలీదని తెలిపారు. బండి సంజయ్‌తో నేను ఎప్పుడూ టచ్‌లో లేనని క్లారిటీ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
పార్టీ మార్పుపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదించాక జరిగే పరిణామాల్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు వెంకట్‌రెడ్డి. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారంటూ పేర్కొన్నారు బండి సంజయ్. మునుగోడు లో 100% బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి టచ్ లోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.