క్రెడిట్‌ కార్డు ద్వారా బంగారం కొని ఈఎమ్‌ఐగా మార్చాలనుకుంటున్నారా.?

-

క్రెడిట్‌ కార్డు ఈజీగా వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే లేనిపోని చిక్కుల్లో పడాల్సిందే. క్రెడిట్‌ కార్డును కరెక్టుగా వాడుకుంటే..మీకు చాలా సేఫ్‌ అవుతారు. ఒకరి దగ్గర నుంచి డబ్బులు అడగాల్సిన పనే ఉండదు. క్రెడిట్‌ కార్డు వాడేవారికి ముందు కావాల్సింది ఆర్థిక క్రమశిక్షణ. చేతిలో డబ్బులున్నా..అవసరం ఉన్నవాటికే ఖర్చుపెట్టాలి. అయితే క్రెడిట్‌ కార్డులో చేసిన ట్రాన్సాక్షన్‌కు ఈఎమ్‌ఐ ఆప్షన్‌ ఉంటుందని అందరూ అనుకుంటారు. కొన్నిసార్లు ఈఎమ్‌ఐలో కన్వర్ట్‌ చేసుకోవచ్చు అని ధైర్యంతో ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ ప్రతి ట్రాన్సక్షన్‌కు ఈఎమ్‌ఐ ఆప్షన్‌ ఉండదు అని ముందు మీరు గుర్తుంచుకోవాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌ ఏంటో చూద్దామా..!

క్రెడిట్ కార్డుతో బంగారం కొన్నా ఈఎంఐగా మార్చలేరు. ఎక్కువ మొత్తంలో చేసిన ట్రాన్సాక్షన్‌ను క్రెడిట్ కార్డ్ ఈఎంఐగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఓ విషయం గుర్తుంచుకోవాలి. అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి

ఎక్కువ మొత్తంలో చేసిన ట్రాన్సాక్షన్‌ను క్రెడిట్ కార్డ్ ఈఎంఐగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఓ విషయం గుర్తుంచుకోవాలి. అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

అందుకే చాలా మంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ట్రావెల్ ఖర్చులు, దుస్తులు, ఇన్స్యూరెన్స్ లాంటి పేమెంట్స్‌ని క్రెడిట్ కార్డ్ ద్వారా చేసి ఆ తర్వాత ఈఎంఐగా మారుస్తుంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కొన్ని లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోలేరు. క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం కొంటే ఆ ట్రాన్సాక్షన్‌ను ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉండదు.

ఈ నిబంధన 2013లోనే వచ్చింది. అంతకన్నా ముందు బంగారు నగలు, వజ్రాల నగల్ని క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నా ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉండేది. 2018లో కూడా ఆర్‌బీఐ మరోసారి నిబంధనల్ని జారీ చేసింది. క్రెడిట్ కార్డుతో నగలు కొంటే ఆ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చకూడదంటూ అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశించింది.

ఇక క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో కొన్నా ఈఎంఐగా మార్చుకోలేరు. క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేస్తే ఆ మొత్తాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం కుదరదు. పాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉండదు. ట్రాన్సాక్షన్ జరిపిన 60 రోజుల లోపే ఈఎంఐగా మార్చుకోవచ్చు. 60 రోజులు దాటిందంటే ఈఎంఐగా మార్చుకోలేరు.

ఇక క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో కొన్నా ఈఎంఐగా మార్చుకోలేరు. క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేస్తే ఆ మొత్తాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం కుదరదు. పాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉండదు. ట్రాన్సాక్షన్ జరిపిన 60 రోజుల లోపే ఈఎంఐగా మార్చుకోవచ్చు. 60 రోజులు దాటిందంటే ఈఎంఐగా మార్చుకోలేరు. (ప్రతీకాత్మక చిత్రం)

అయితే కొన్ని బ్యాంకులు మాత్రం పాత ట్రాన్సాక్షన్స్‌ని కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తాయి. ఇవి కాకుండా ఇతర క్రెడిట్ కార్డు లావాదేవీలను ఈఎంగా మార్చుకోవాలనుకునేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 36 శాతం నుంచి 48 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ని ఈఎంఐగా మార్చుకోకూడదు.

ఆప్షన్‌ ఉంది కదా అని ఈఎమ్‌ఐగా మారిస్తే..మనమే నష్టపోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా.. మనకు వచ్చే శాలరీలో కట్టగలమూ అనుకుంటేమో.. క్రెడిట్‌ కార్డులో ముందు ఖర్చుచేసుకోవచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో పడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version