ఫోన్‌ పక్కనే పెట్టుకుని నిద్రపోయే మగవాళ్లకు హెచ్చరిక.. ఆ సమస్య వస్తుందట..

-

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మన వెన్నంటే ఉండేది ఫోన్.. కొందరైతే బాత్రూమ్‌కు వెళ్లేప్పుడు కూడా మొబైల్‌ వదిలిపెట్టరు.. మీరు డే టైంలో ఎంత వాడినా నిద్రపోయేప్పుడు మాత్రం ఫోన్‌ను వీలైనంత దూరంగా పెట్టాలి అని నిపుణులు చెప్తూనే ఉంటారు. కానీ గుండే తీసి పక్కన పెట్టమన్నట్లు మనం ఫీల్‌ అయిపోతాం..ఫోన్‌ దూరంగా పెట్టాలంటే.. నిద్రవచ్చే వరకూ కాదు ఆ ఫోనే మనల్ని నిద్రపుచ్చుతుంది.. అలానే మీద పడేసుకునే పక్కనే పెట్టుకుని నిద్రలోకి జారుకుంటారు. దీని వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ ప్రమాదమే.. అయితే ఇలా చేయడం వల్ల మగవారికి రిస్క్‌ ఎక్కువగా ఉంటుందట..

మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు…బ్లూ కిరణాల కారణంగా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్య వస్తుంది. ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ కారణంగా మెదడు క్యాన్సర్‌ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ గతంలోనే హెచ్చరించింది. కాబట్టి ఫోన్‌ను అధికంగా వినియోగించకుండా మనకు మనమే నియమాలు, నిబంధనలు విధించుకోవాలి.

ఫోన్‌ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచి నిద్రపోవాలి.. రాత్రి పూట నిద్రపోయే ముందు చాలా మంది ఫోన్‌తో టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలా చేస్తే అరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి నిద్రపోయే సమయానికి అరగంట ముందు స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్, వైబ్రేషన్స్ రాకుండా సెట్టింగ్స్ చేసుకోవాలి.

ఫోన్‌ పక్కనే ఉంచి నిద్రపోవడం వల్ల..ఉదయం మూడీగా, అలసిపోయినట్టు, డిస్టర్బ్‌గా లేస్తూ ఉంటారు. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. మొబైల్ ఫోన్‌లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయనే విషయం చదువుకున్న అందరికీ తెలుసు..ఇది మెదడును దెబ్బతీస్తుంది. ఫలితంగా తలనొప్పి, కండరాల నొప్పి సమస్యలు వస్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news