రోహిత్ అంటే అందుకే బౌలర్లు భయపడతారు: వసీం అక్రమ్

-

వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఎదురులేని జట్టుగా ఇండియా దూసుకుపోతోంది. లీగ్ స్టేజ్ లో ఆఖరి మ్యాచ్ ను నిన్న ఆడిన ఇండియా నెదర్లాండ్ ను చిత్తుగా ఓడించి అపజయం అన్నది ఎరుగని జట్టుగా సెమీస్ మ్యాచ్ ను ఆడనుంది. ఈ బుధవారం (15 నవంబర్) ముంబై వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ ను ఆడనున్నారు. కాగా నిన్న మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ గురించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ లా ఎవ్వరూ బ్యాటింగ్ చేయలేరు, ప్రపంచం అంతా కూడా కోహ్లీ, బాబర్, రూట్ మరియు విలియమ్సన్ ల బ్యాటింగ్ గురించి మాత్రమే మాట్లాడుతారని, అయితే మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే రోహిత్ శర్మ లా ఎవ్వరూ బ్యాటింగ్ చేయలేరు అంటూ వసీం అక్రమ్ ఆకాశానికి ఎత్తేశారు.

రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే ఇంతా సులభమా ఆడడం అనిపిస్తుంది, బౌలర్ ఎవరైనా పరిస్థితి ఏ విధంగా ఉన్నా అద్భుతమైన షాట్ లు కొట్టడంలో సిద్ధహస్తుడు అంటూ పొగిడారు వసీం. అందుకే బౌలర్లు, ప్రత్యర్ధులు రోహిత్ ను చూసి భయపడుతారన్నారు వసీం అక్రమ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version