పెట్రోల్ గురించి మాట్లాడాలంటేనే సామాన్యుల గుండెల్లో మంట పుట్టుకొస్తుంది. ధరలు అంతలా మండిపోతున్నప్పుడు ఆ మాత్రం దడ ఖచ్చితంగా ఉంటుంది. వంద రూపాయలు దాటి ఇంకా పెరుగుతూనే పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబులు చిల్లులు పొడిచేసాయి. ఇంధన ధరల విషయంలో అటు ప్రతిపక్షాలు పోరు పెడుతూనే ఉన్నాయి. కానీ, ధరలు మాత్రం తగ్గలేదు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, యూపీఐ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ల వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయని, తమ ప్రభుత్వం ఆయిల్ బాండ్లకు వడ్డీలు కడుతుండడం మూలానే పన్నులు తగ్గించలేకపోతున్నామని అన్నారు. పెట్రోల్, డిజీల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించకపోవడానికి ఇదే కారణమని వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.