వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకి తెలంగాణ పోరాటమే స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఉందని, రజాకార్లు సహా పాలకుల అన్యాయంపై తరాలపాటు పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.
శ్రీకాంత్ చారి వంటి వెయ్యి మంది అమరుల ఆత్మబలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందని.. అలాంటి తెలంగాణలో కొండగట్టు నుంచే ప్రయాణం మొదలుపెడదామని అన్నారు. తెలంగాణలో 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాలలో.. రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేద్దామని కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.