దేశ భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమాయకులను చంపిన వారినే మేము చంపామని తెలిపారు. పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులపై భారత సైన్యం తమ సత్తా ఏంటో చూపించింది. పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం చేయలేదని తెలిపారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శుత్రువులకు తగిన విధంగా బుద్ది చెప్పామని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు తెలిపారు రాజ్ నాథ్ సింగ్.