పెద్ద పెద్ద వారి పెళ్లికి ఎంట్రీ పాస్‌లు ఉంటాయని తెలసు. లేదంటే వెడ్డింగ్ కార్డునే ఎంట్రీ పాస్‌గా చూపెట్టాల్సి ఉంటుంది. కానీ ఎక్కడైనా పెళ్లికి ఆధార్ కార్డు కావాలని రూల్ ఉంటందా..? అక్కడ ఉంద. ఆధార్ కార్డ్ ఉంటేనే పెళ్లికి అనుమతి.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఒక పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి యూపీలోని అమ్రోహా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉన్న హసన్ పూర్ లోని ఒక పెళ్లి జరిగింది. అక్కడ అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు ఒకేసారి జరిగాయి. అయితే.. వేడుకలో జనాలు పిలిచిన దానికంటే ఎక్కువగా కన్పించారు. దీంతో పెళ్లి వారు తలలు పట్టుకున్నారు. కల్యాణ మండపం సరిపోక బంధువులు ఇబ్బంది పడ్డారు. కొందరు పిలువని వారు కూడా పెళ్ళికి వచ్చినట్లుగా పెళ్లివారు గుర్తించారు.
అయితే.. విందుకు మాత్రం హజరయ్యే వారు తప్పకుండా ఆధార్ కార్డు చూపించాలంటూ కండీషన్ పెట్టారు. విందుకు వెళ్లే డోర్ దగ్గరు కొందరిని నిలబెట్టారు. వరుసగా.. ఒక్కొక్కరి ఆధార్ కార్డు (Aadhaar Cards) చూసిన తర్వాత లోపలికి పంపారు.. అయితే.. కొంత మంది బంధువులు దీన్ని అవమానంగా భావించి వెళ్లిపోయారు పాపం…. మరికొందరు మాత్రం ఆధార్ కార్డు చూపించి మరీ విందు భోజనం హల్‌కు చేరుకున్నారు. దీన్ని అక్కడున్న వారు తమ ఫోన్‌లో రికార్డు చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.
దీన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్లినా ఏటియం కార్డులే కాదు.. ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్లాల్సిందే అనమాట.. ఏమో మీరు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే సడన్‌గా ఇలాంటి పరిస్థితి ఎదురైతే..! ఈ మధ్య పెళ్లిల్లో జరిగే కొన్ని వెరైటీ ఘటనల వల్ల అవి కాస్త వైరల్‌గా అవుతున్నాయి.. మొన్నా మధ్య..పెళ్లికొడుకు ఫ్రెండ్స్ పెళ్లికూతిరి చేత ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు. ఆ అగ్రిమెంట్ సారాంశం.. పెళ్లైన తర్వాత కూడా వాళ్ల ఫ్రెండ్‌ను క్రికెట్ ఆడేందుకు పంపాలని..! ఇలాంటి సోషల్ మీడియా వేదికగా నాలుగు రోజులు చెక్కర్లుకొడుతున్నాయి..!