సైన్స్ ఆధారంగా త్వరగా బరువు తగ్గడానికి కావాల్సిన టెక్నిక్స్..

-

బరువు తగ్గాలనుకునే చాలామంది వారు పాటించే డైట్ కారణంగా ఎక్కువ ఆకలికి లోనవుతుంటారు. ఆ అలవాట్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ ఆకలి ఎక్కువ అవడం మూలంగా ఎక్కువ రోజులు పాటించలేకపోతారు. అందుకే ఆహారం సరిగ్గా తీసుకుంటూనే బరువు తగ్గే డైట్ అలవాట్లు పాటించడం మంచిది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఇతర విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రస్తుతం అలాంటి వాటి గురించి చర్చిద్దాం.

బరువు

రిఫైన్ కార్బోహైడ్రేట్లని దూరం పెట్టడం

బరువు తగ్గాలనుకునే వారు చేయాల్సిన మొదటి పని రిఫైన్ కార్బోహైడ్రేట్లని దూరం పెట్టడం. వాటి స్థానంలో తృణ ధాన్యాలని ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉమ్డి ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి ఆకలి వేయకుండా చేస్తాయి.

కూరగాయలు

మీ భోజన పళ్ళెంలో ఆకు కూరలు ఎక్కువగా ఉంటే చాలా సులభంగా బరువు తగ్గుతారు. ఆకు కూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సాయం చేస్తాయి. తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆకు కూరల విషయానికి వస్తే, బ్రోకలీ, కాలీ ఫ్లవర్, పాలకూర, టమాట, క్యాబేజీ, దోసకాయ మొదలగునవి.

అలాగే అన్ని కొవ్వులు చేటు చేస్తాయనుకుంటే పొరపాటే, ఆలివ్ ఆయిల్, అవొకోడో ఆయిల్ శరీరానికి మంచి కొవ్వుని అందిస్తాయి. ఇవి మీ డైట్ లో బాగా ప్రాముఖ్యత వహిస్తాయి.

శారీరక శ్రమ

డైట్ తో పాటు శారీరక శ్రమ బరువు తగ్గడాన్ని మరింత సులభతరం చేస్తుంది. బరువులు ఎత్తడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. దీంతో పాటు శరీరం చురుగ్గా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు శారీరక శ్రమని తమ డైట్ లో చేర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news