చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే చాలామందికి చియా గింజలను ఏ విధంగా తీసుకోవాలి అని తెలియదు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా తీసుకుంటే సులభంగా మనం బరువు తగ్గడానికి వీలవుతుంది.
చిలకడ దుంపలతో:
చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, సెలీనియం, విటమిన్ బి, సి ఉంటాయి. మీరు చిలకడదుంపలని ఉడికించుకుని ఆ తర్వాత దాని మీద చియా గింజలని వేసి కూడా తీసుకోవచ్చు. రుచి కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఫ్రూట్ సలాడ్ పైన:
చాలా మంది ఫ్రూట్ సలాడ్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఫ్రూట్ సలాడ్ తీసుకునేటప్పుడు దాని మీద చియా గింజలు వేసుకొని తీసుకోండి.
పుడ్డింగ్:
పుడ్డింగ్ చేసినప్పుడు దాని మీద చియా సీడ్స్ వేసుకొని మీరు తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి అన్నది చూస్తే.. ఒక కప్పు బాదం పాలలో నాలుగు టీ స్పూన్లు చియా సీడ్స్ వేసి అందులో రెండు టీ స్పూన్ల తేనె, అర టీస్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసి బ్లెండ్ చేయాలి. ఇలా ఈ విధంగా తీసుకుంటే కూడా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పెరుగు:
మీరు పెరుగు తీసుకుని అందులో పండ్లు, నట్స్ మరియు గింజల్ని వేసి తీసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఓట్ మీల్:
ఓట్ మీల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, బీపీ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు ఓట్మీల్ చేసుకున్నప్పుడు దానిలో చియా సీడ్స్ వేసి కూడా తీసుకోవచ్చు ఇలా మీరు ఈ ఆహారపదార్థాలతో సులభంగా చియా గింజలు తీసుకోవచ్చు. తద్వారా బరువు తగ్గడం మొదలు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.