ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!

-

బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా…? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీకోసం కొన్ని చిట్కాలు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఒబిసిటీ, క్యాన్సర్ మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకని ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం నిజంగా ప్రమాదకరం.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ ఇన్ఫమేటరీ ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్ళల్లో వేసుకొని మిక్స్ చేసి కొద్దిగా తేనె వేసుకొని తాగితే సరిపోతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇతర ప్రయోజనాలు కూడా
గ్రీన్ టీ వల్ల మనకి కలుగుతాయి. మీరు ప్రతి రోజూ ఒక కప్పు గోరువెచ్చని గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా బరువు తగ్గడానికి కూడా వీలవుతుంది.

తేనె మరియు నిమ్మ:

బరువు తగ్గడానికి ఇది చాలా మంచి టిప్. నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా తేనె లో లిపిడ్ లోవెరింగ్ ఆక్టివిటీస్ ఉంటాయి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె అర టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా బరువు తగ్గొచ్చు. అలానే అలోవెరా జ్యూస్, క్రాన్ బెర్రీ జ్యూస్ కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. కనుక ఈ పద్ధతులని అనుసరించి ఆరోగ్యంగా వుండండి. అలానే బరువుని తగ్గండి.

Read more RELATED
Recommended to you

Latest news