ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏం తినాలి..? మరి మీ బ్లడ్ గ్రూప్ కి ఏం తినాలో చూసేయండి..!

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు. అయితే ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. మనం కనుక బ్లడ్ గ్రూప్ ని బట్టి ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి ఇంకా మంచిదని అంటున్నారు. అయితే మరి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనేది చూద్దాం.

”A” బ్లడ్ గ్రూప్:

ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు మాంసం ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి.
తృణధాన్యాలు తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలి.

”B” బ్లడ్ గ్రూప్:

బి గ్రూప్ వాళ్ళు మాంసం, తక్కువ కొవ్వు ఉండే పాలు తీసుకోవాలి.
ఆకుపచ్చగా ఉండే కూరగాయలను తీసుకోవాలి.
అలానే ఈ గ్రూప్ వాళ్ళు గోధుమలు, కాయ దాన్యాలు, టమాటాలు, వేరుశనగ, మొక్క జొన్న తినకూడదు.
మాంసాన్ని వీళ్ళు తినొచ్చు కానీ చికెన్ తినకూడదు.

”AB” బ్లడ్ గ్రూప్:

ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు మొక్కజొన్న, గొడ్డు మాంసం, చికెన్ ని అస్సలు తినకూడదు.
వీరికి ఆకుకూరలు, సీ ఫుడ్, టోఫు మంచిది.
వీరికి కడుపులో ఆమ్లం తక్కువ ఉంటుంది.
కెఫిన్ ని ఆల్కహాల్ ని అస్సలు తీసుకోకూడదు.

”O” బ్లడ్ గ్రూప్:

బీన్స్, పాలు, ధాన్యాలు వంటివి వీరు తీసుకోవచ్చు.
ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news