మరి కేసీఆర్ ఏ కాన్ఫిడెన్స్‌తో జాతీయ పార్టీ పెడుతున్నారో తెలియదు గాని..ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తుందా? అనే విషయం పెద్ద డౌట్ గానే ఉంది. సరే బీజేపీపై పోరు అని చెప్పి..కేసీఆర్ రాష్ట్ర స్థాయి పార్టీగా ఉన్న టీఆర్ఎస్ని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి..మోదీ సర్కార్‌ని గద్దె దించడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మోదీని గద్దె దించడం పక్కన పెడితే..అసలు కేసీఆర్ జాతీయ పార్టీ ఎంతవరకు రాణిస్తుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే అల్లాటప్పగా మాత్రం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టరనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆరితేరి ఉన్న కేసీఆర్‌కు చాలా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆయన జాతీయ పార్టీ పెట్టడం వెనుక ఏదో వ్యూహం కూడా ఉండి ఉంటుంది. ఎంత వ్యూహం ఉన్నా సరే..ఇప్పుడున్న పరిస్తితుల్లో జాతీయ పార్టీ పెట్టి రాణించడం అనేది సాధ్యం కాదు.
ఎందుకంటే కేంద్రంలో బలంగా బీజేపీ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది. ఇక కమ్యూనిస్టులు, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఉండనే ఉన్నాయి. అలాగే డీఎంకే, వైసీపీ, బీజేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో కేవలం తెలంగాణకు పరిమితమైన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన సత్తా చాటడం అనేది కష్టమైన పని.
అసలు తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉంటే..ఇప్పుడు అందులో సగం సీట్లలోనే టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అలాంటప్పుడు జాతీయ పార్టీ ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటడం అనేది ఈజీ కాదు. ముందు తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో 15 సీట్లు గెలిస్తే గొప్పే. మరి దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా సత్తా చాటుతుందో చూడాలి.17లో సగం డౌటే..చక్రం తిప్పేది ఎలా?
మరి కేసీఆర్ ఏ కాన్ఫిడెన్స్‌తో జాతీయ పార్టీ పెడుతున్నారో తెలియదు గాని..ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తుందా? అనే విషయం పెద్ద డౌట్ గానే ఉంది. సరే బీజేపీపై పోరు అని చెప్పి..కేసీఆర్ రాష్ట్ర స్థాయి పార్టీగా ఉన్న టీఆర్ఎస్ని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి..మోదీ సర్కార్‌ని గద్దె దించడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మోదీని గద్దె దించడం పక్కన పెడితే..అసలు కేసీఆర్ జాతీయ పార్టీ ఎంతవరకు రాణిస్తుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే అల్లాటప్పగా మాత్రం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టరనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆరితేరి ఉన్న కేసీఆర్‌కు చాలా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆయన జాతీయ పార్టీ పెట్టడం వెనుక ఏదో వ్యూహం కూడా ఉండి ఉంటుంది. ఎంత వ్యూహం ఉన్నా సరే..ఇప్పుడున్న పరిస్తితుల్లో జాతీయ పార్టీ పెట్టి రాణించడం అనేది సాధ్యం కాదు.
ఎందుకంటే కేంద్రంలో బలంగా బీజేపీ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది. ఇక కమ్యూనిస్టులు, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఉండనే ఉన్నాయి. అలాగే డీఎంకే, వైసీపీ, బీజేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో కేవలం తెలంగాణకు పరిమితమైన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన సత్తా చాటడం అనేది కష్టమైన పని.
అసలు తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉంటే..ఇప్పుడు అందులో సగం సీట్లలోనే టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అలాంటప్పుడు జాతీయ పార్టీ ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటడం అనేది ఈజీ కాదు. ముందు తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో 15 సీట్లు గెలిస్తే గొప్పే. మరి దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా సత్తా చాటుతుందో చూడాలి.