తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం ఇటీవల కాలంలో బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మొదట నుంచి వివాదాల్లో ఎక్కువగా ఉండే రాజాసింగ్….ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..సంచలనంగా మారారు. ఇక రాజాసింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి…నిరసనలు తెలియజేశాయి.
పైగా రాజాసింగ్‌ని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు..దీనిపై తీవ్ర నిరసలు వచ్చాయి. దీంతో రాజాసింగ్‌పై పీడీయాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. అయితే అప్పటికే రాజాసింగ్‌ని బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవుల నుంచి తొలగించింది. అయితే సస్పెన్షన్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఇక దీనిపై వివరణ ఇస్తానని రాజాసింగ్ చెప్పారు.
ఇంకా అంతే మళ్ళీ రాజాసింగ్ వ్యవహారంపై బీజేపీ ఏ మాత్రం స్పందించడం లేదు. కానీ ఎంఐఎం, టీఆర్ఎస్ మాత్రం…రాజాసింగ్ ద్వారా బీజేపీని టార్గెట్ చేస్తుంది. మత కలహాలు సృష్టించేందుకు బీజేపీ చూస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. రాజాసింగ్‌పై వేటు కూడా ఒక డ్రామా అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న రాజాసింగ్ వ్యవహారంపై బీజేపీ నేతలు కామెంట్ చేయడం లేదు. అలాగే ఆయనపై సానుభూతి చూపించడం లేదు. పార్టీ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పే అని…ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కే లక్ష్మణ్ అన్నారు.
కానీ ఆయనపై సస్పెన్షన్ కొనసాగిస్తారా? అసలు నెక్స్ట్ బీజేపీలో రాజాసింగ్ పొజిషన్ ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. అదే సమయంలో సొంత నియోజకవర్గం గోషామహల్‌కు సంబంధించిన కార్పొరేటర్ల నుంచి కూడా రాజాసింగ్‌కు మద్ధతు రావడం లేదు. పైగా వారిలో ముగ్గురు…నెక్స్ట్ గోషామహల్ సీటు తమదంటే తమదని ప్రకటించుకుంటున్నారు. మరి చూడాలి రాజాసింగ్ వ్యవహారం చివరికి ఏం అవుతుందో.