వాటర్ థెరఫి అంటే ఏమిటి..నీటిని ఎలా,ఎప్పుడు,ఎంత త్రాగాలి..?

-

నీరు మనిషి పాలిట ప్రాణాధారం. నీరు లేనిదే మానవునికి మనుగడలేదు. అందువల్లనే నీటిని బాగా తీసుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక సగటు మనిషి ప్రతిరోజు సుమారు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. అయితే నీటిని తీసుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు మరియు సమయాలున్నాయి.అయితే మనం ఎంత నీరు ఎప్పుడు త్రాగాలి,ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఉదయాన్నే మేల్కొవగానే మరుక్షణం ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న నీరు మన దాహార్తిని తీర్చడంతో పాటు, శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజపరిచి, మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇలా ప్రతి రోజు నీరు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య కూడా తరుగుతుంది.

స్నానం చేయడానికి కొంచెం సేపు ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వలన ఇది శరీరంలోని అధిక రక్తపోటు వంటి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.అలానే మధ్యాహ్నం ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు నీరుని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ఇది కేవలం మన జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరం తేలిగ్గా గ్రహించేందుకు సహాయపడుతుంది.

వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు, వ్యాయా మానికి ముందుగా ఒకటి లేదా రెండు గ్లాసులు నీరు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇది శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అలానే వ్యాయామం చేసిన తర్వాత కూడా ఒక గ్లాస్ నీటిని తీసుకోవడం చాలా ఉత్తమం. వ్యాయామం చేసిన తర్వాత నష్టపోయిన లవణాలను, ఈ నీరు భర్తీ చేస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు ప్రత్యేకంగా వాటర్ థెరపీ తీసుకొచ్చారు. ఈ వాటర్ థెరపీ నీ మీరు పాటించారు అంటే ఎటువంటి సమస్యలు దరి చేరవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version