జ‌గ్గారెడ్డి పార్టీ  వ‌స్తే ఎవ‌రికి లాభం?

-

కొత్త పార్టీ పెడ‌తానంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అంటున్నారు.అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక కూడా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని అంటున్నారు.గ‌త కొద్ది రోజులుగా పార్టీకి రాజీనామా చేస్తాన‌ని చెబుతూ వ‌స్తున్న జ‌గ్గారెడ్డి త‌న‌దైన పంథాలో స్పందించారు.సీనియ‌ర్లు చెప్పినా కూడా త‌న నిర్ణ‌యాల‌ను వాయిదా వేసుకుంటాన‌ని అనుకోవ‌ద్దు అని, బ‌ట్ తాను ఏం చేయాలో అదే చేస్తాన‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు.ఈ నేప‌థ్యంలో టీపీసీసీ లోముస‌లం మొదలైంది.రేవంత్ పై ఇప్పుడిక తిరుబాటు త‌ప్ప‌ద‌ని తేలిపోయింది.

ఇక పీసీసీ చీఫ్ చిక్కుల్లో ప‌డిపోనున్నారు.గ‌త కొద్ది కాలంగా ఆయ‌న పెద్ద‌గా యాక్టివ్ గా పార్టీని న‌డ‌ప‌లేక‌పోతున్నార‌ని,అంత‌ర్గ‌త విభేదాలు  స‌ర్దుబాటు చేయలేక‌పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.వ‌రుస వైఫ‌ల్యాలు కూడా ఆయ‌న‌ను వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా హుజురాబాద్‌లో గెలిచినా ఓడినా స‌రే గ‌ట్టిపోటీ ఇవ్వ‌లేక‌పోయారు అన్న వాద‌న వినిపిస్తుంది. తొలి రోజుల్లో స‌భ‌లు, స‌మావేశాలు, ధ‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లింప‌జేసినా కూడా త‌రువాత ఆయ‌న సైలెంట్ అయిపోయారు.దీంతో రేవంత్ ఫ‌క్తు చంద్ర‌బాబు మ‌నిషి అన్న మాట‌ను ఒక‌టి బాగానే పార్టీలోకి తీసుకుని వెళ్లారు.ఆయ‌నేం చెబితే అదే ఈయ‌న చేస్తారన్న వాద‌న ఒక‌టి స్థిర‌ప‌డిపోయింది. ఇవ‌న్నీ జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హానికి కార‌ణం అయ్యాయి.నియోజ‌క‌వర్గ ప‌రిధిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ నిర‌స‌న చేప‌ట్టినా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న త‌న‌కు ఆహ్వానం అందడ‌మే లేద‌ని వాపోతున్నారు. రేవంత్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని  అంటున్నారాయ‌న‌.ఇవ‌న్నీ నిర‌సిస్తూ సొంతంగా పార్టీ పెట్టేందుకే ఉత్సాహం చూపుతున్నారు జ‌గ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version