పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతలుగా మార్చడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమ. కమిషన్ల కక్కుర్తి తో రివర్స్ టెండర్రింగ్ డ్రామా తో జరుగుతున్న పనులు ఆపారని.. ఏడాదిగా ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయలేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు దేవినేని ఉమ. 31 మంది ఎంపీలు ఉండే ఒక్కసారైనా నిధులు అడిగారా? అని ప్రశ్నించారు.
ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని సీఎం జగన్ పై దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. టీఏసీలో 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు రూ. 55,548 కోట్లకు ఆమోదం తెస్తే 42 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. కేసుల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టిన సీఎం జగన్ పోలవరం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. నిర్వాసితులను మోసం చేసి గోదావరిలో ముంచేసారని మండిపడ్డారు.
పోలవరాన్ని ఎత్తిపోతలగామార్చడం రాష్ట్రరైతాంగ ప్రయోజనాలను తాకట్టుపెట్టడమే. కమిషన్లకక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాతో పనులుఆపారు.ఏడాదిగా ఒక్కశాతం పనులుచేయలేదు. 31మంది ఎంపీలుండి ఒక్కసారైనా నిధులడిగారా? కేసులకోసం పోలవరాన్నితాకట్టుపెట్టిన@ysjagan పోలవరంద్రోహిగా చరిత్రలోనిలిచిపోతారు pic.twitter.com/iku0y1EkNV
— Devineni Uma (@DevineniUma) November 18, 2022