ఎప్పుడైనా గమనించినట్లయితే పౌర్ణమి నాడు అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మిగిలిన రోజులు కంటే కూడా పౌర్ణమి నాడు అలలు వేగంగా పెద్దగా వస్తుంటాయి. దాని వెనుక కారణం ఏమిటి.. ఎందుకు పౌర్ణమి నాడే అలలు వస్తాయి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. సముద్రాల లో జరిగే మార్పులు చూస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది.
అలలు పెద్దగా పౌర్ణమి నాడు రావడం వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. తెలుసుకోవాలంటే వెంటనే ఓ లుక్ వేసేయండి. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు పౌర్ణమి. ఆ సమయంలో అలలు బాగా విపరీతంగా వస్తాయి. చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి అలలు మారుతాయి. అందుకే ఒక్కో సారి తక్కువగా మరో సారి ఎక్కువగా ఉంటాయి. సముద్రం ఒక్కటే కాదు భూమి కూడా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కి గురవుతుంది. సముద్రాలు ద్రవ రూపంలో ఉంటాయి కాబట్టి మార్పు మనకి బాగా కనబడుతుంది. భూమి కి కూడా చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు మార్పులు వస్తాయి కానీ పెద్దగా మనకి కనపడవు.
ఎందుకంటే భూమి ఘన రూపంలో ఉంటుంది. మార్పు అయితే ఉంటుంది కానీ మనకి కళ్ళకే కనబడదు. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారం లో చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అదే చంద్రుడు కనుక దూరంగా ఉంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది. ఇదేనండి అలలు లో మార్పు రావడానికి కారణం.