బిగ్ బాస్: కంటెస్టెంట్లు తప్పులు చేస్తే నాగార్జున దండం పెట్టాలా.?

-

బిగ్ బాస్ లో శనివారం వచ్చిందంటే వ్యాఖ్యతగా నాగార్జున వస్తాడని తెలిసిందే. ఐతే ప్రతీవారం ఆ వారం మొత్తం కంటెస్టెంట్లు ఏమేం తప్పులు చేసారో వివరించి వారికి క్లాసులు పీకుతుంటాడు. ఈ సారి కూడా అలాగే జరిగింది. బెస్ట్ కెప్టెన్ అని చెప్పబడిన హారికని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, అభిజిత్ కి ఫేవరేట్ గా ఆట ఆడిన నువ్వు బెస్ట్ కెప్టెన్ ఎలా అవుతావు అని అడగడంతో హారికకి మాటరాకుండా పోయింది.

ఇంగ్లీష్ లో మాట్లాడినా, టాస్క్ చేయనని చెప్పినా అభిజిత్ కి పనిష్మెంట్ ఇవ్వకపోవడం ఎంత వరకు కరెక్ట్ అని అడిగితే తన దగ్గర సమాధానం లేకపోయింది. మొత్తానికి బెస్ట్ కెప్టెన్ గా ఎన్నికైన హారిక, బెస్ట్ కాదని నాగార్జున తేల్చేసాడు. ఇక అభిజిత్ పై నాగార్జున చాలా కోపంగా కనిపించాడు. మోనాల్ విషయంలో నన్ను తీసుకురావద్దని చెప్పిన అభిజిత్, నువ్వే తనని ఏడిపిస్తున్నా అని ఒప్పుకున్నావ్ కదా మళ్ళీ అడిగితే మాత్రం కాదంటున్నావ్, ఏమైనా అంటే సారీ చెబుతున్నావ్ అంటూ హౌస్ గేట్లు ఓపెన్ చేయమని చెప్పాడు.

చివరికి అభిజిత్, తన తప్పు ఒప్పుకున్నాడు. ఒకవేళ అభిజిత్ తప్పు ఒప్పుకోకపోతే హౌస్ నుండి బయటకి పంపాలని అనుకున్నామని నాగార్జున చెప్పాడు. అదలా ఉంచితే, గేమ్ ని గేమ్ లా ఆడట్లేదని, బిగ్ బాస్ టాస్క్ ఇస్తే పట్టించుకోవట్లేదని కోప్పడ్డ నాగార్జున, దండం పెట్టి మరీ మీలా మీరు ఆడండని అన్నాడు. నాగార్జున దండం పెట్టి మరీ చెప్పడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. మూడవ సీజన్ ని చాలా సాఫీగా రన్ చేసిన నాగార్జున, ఈ సీజన్లో మాత్రం కాస్త కష్టపడుతున్నట్టున్నాడు.

దానికి కారణం కంటెస్టెంట్లే. కంటెస్టెంట్లు చేసిన తప్పులకి నాగార్జున దండం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆటలో ఫేవరిటిజం, ఖాళీగా కూర్చుని అనవసరమైన అనలైజేషన్ తో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోని రక్తికట్టించలేకపోతున్నారు. మరి ఇది బిగ్ బాస్ తప్పా? కంటెస్టెంట్ల తప్పా ? దండం పెట్టిన నాగార్జున గారిది తప్పా అన్నది ఆసక్తికరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version