డేగలు నిజంగా 70 ఏళ్లు బతుకుతాయా..?

-

మనకేదైనా అవకాశం వచ్చి అది పక్కనోళ్లు తీసుకుంటే..వచ్చిన అవకాశాన్ని డేగలా తన్నుకుపోయాడని మనం వాళ్లను తిట్టుకుంటాం.. అలాగే అనవసరంగా డేగను కూడా తిడతాం.. డేగలు అసలు ఎక్కువగా మనల్ని డిస్టబ్‌ చేయవు.. వాటి బతుకేదో అవి బతుకుతాయి.. కానీ మీకు వాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తే నిజంగా షాక్‌ అవుతారు. భూమిపై బతికే పక్షులన్నింటిలో డేగ అత్యధికంగా 70 ఏళ్లు బతుకుతుందని అంటుంటారు. దీనిలో నిజమెంతా? అనేది మాత్రం ఇప్పటికీ చాలా మందికి ప్రశ్నగానే మిగిలిపోయింది.
అడవిలో బతికే డేగలు 30 ఏళ్లు బతుకుతాయి. ప్రత్యేకంగా పెంచే డేగలు 50 ఏళ్ల వరకు బతుకుతాయి. కొన్ని రకాల డేగలు 31 సంవత్సరాల 8 నెలలపాటు బతుకుతాయి. వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త టాడ్ కాట్జ్నర్ 25 సంవత్సరాలు డేగలను అధ్యయనం చేసి ‘ది ఈగిల్ వాచర్స్’ అనే పుస్తకాన్ని రాశారు. గద్ద ముక్కు పెరిగిపోతే అది రాళ్లకేసి కొట్టుకుని, ముక్కు విరగగొట్టుకుంటుందని, కొంతకాలానికి తిరిగి డేగ ముక్కు పెరిగుతుందని అనుకుంటారు. నిజానికి.. డేగ మాత్రమేకాదు ఏ పక్షికైనా చిన్నగాయం తగిలితే కొంతకాలానికి అది నయం అవుతుంది. అదే ముక్కు విరగడం వంటివి జరిగితే అవి బతికినంత కాలం అంగవైకల్యంతోనే బతుకుతాయి తప్ప తిరిగి పెరిగే అవకాశం ఉండదని టాడ్ కాట్జ్నర్ తన బుక్‌లో పేర్కొన్నారు.
అంటే ముక్కుతిరిగి పెరగదన్నమాట. ఇలా ముక్కు విరిగిన పక్షులు ఆహారాన్ని తినలేవు. అయితే డేగ గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్‌ ఏంటంటే.. అవి ముసలి వయసుకు వస్తున్నప్పుడు భూమిలోకి వెళ్లిపోతాయి. వాటి ముక్కుతో ఇసుకలో గొయ్యిలాగా తవ్వి..ఆ భూమిలోకి వెళ్లి వాటి ఒంటిమీద ఉన్న జుట్టును అంతా పీకేసుకుంటాయి.. అలా నగ్నంగా ఆరు నెలల వరకూ ఉండి.. మళ్లీ కొత్త జుట్టుతో యవ్వనంగా మారి వస్తాయట.. అంటే అవి ముసలిగా కనిపించవనమాట.. అయితే ఇది ఎంత వరకూ నిజం అని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ.. నిపుణులు, ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version