పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభకానున్నాయి. 25 రోజులపాటు జరిగే సమావేశాలలో 36 బిల్లులను ప్రవేశ పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వీటిలో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు పెగాసెస్, ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.
లోక్‌సభ మొదటి రోజే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశ పెట్టనున్నారు. దీంతోపాటు క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, దివాళా(రెండో సవరణ) బిల్లు, 2021, ఎలక్ట్రిసిటీ(సవరణ) బిల్లులను వంటి ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
Parlament