మీ ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. అటల్ పెన్షన్ యోజన పథకం లో చేరాలని భావించే వారికి రిలీఫ్ ని ఇచ్చే ఓ ప్రకటన చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ PFRDA తాజాగా అటల్ పెన్షన్ యోజన APY పథకానికి ఆధార్ ఇకేవైసీ సర్వీస్‌ను అందుబాటు లోకి తెచ్చింది. అయితే నిజంగా స్కీమ్ లో చేరాలని అనుకునే వారికి మంచి వార్త.
మీరు కనుక ఈ స్కీమ్ లో చేరాలి అని అనుకుంటే బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళాలి. అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారికి ఇది ఊరటని ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ పధకం లో ఎవరైనా చేరాలి అంటే వీలుగా ఏపీవై స్కీమ్ రూల్స్‌ను సవరించామని పీఎఫ్ఆర్‌డీఏ అంది.
స్కీమ్‌ను మరింత మందికి చేరువ చేయడానికి వీటిని సవరించామని పీఎఫ్ఆర్‌డీఏ చెప్పింది. అటల్ పెన్షన్ యోజన పథకం లో చేరాలి అంటే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పధకం వలన ప్రతీ నెలా కొంతం మొత్తం చెల్లించాలి. ఇక ఎంత డబ్బు వస్తుంది అనేది చూస్తే 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి నెలకు రూ.1000 నుంచి రూ.5 వేలు పొందొచ్చు. వయసు, పెన్షన్ డబ్బులుని బట్టి డబ్బులు వస్తాయి.