నీ భర్త జైలు నుంచి రావాలంటే.. నాతో గడపాల్సిందే

-

ఇంట్లో ఆయుధం ఉన్న కారణంగా అరెస్టైన భర్తను జైలు నుంచి విడిపించుకోవాలి అనుకున్న ఓ ఇల్లాలుకు ఒక లాయర్ పరిచయం అయ్యాడు. తన పేరు కాబూల్‌ అని, కోర్టులో చాలా పలుకుబడి ఉందని ఆమె భర్తను త్వరలోనే విడిపించేస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆమె.. తన మొబైల్ నంబర్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సడెన్‌గా ఆమె ఇంటికి వచ్చేసిన కాబూల్.. ఆమెను బలాత్కరించాడు. సదరు యువతి వయసు 23 సంవత్సరాలని తెలుస్తోంది. ఆమెపై జరిగిన అఘాయిత్యం గురించి ఎవరికైనా చెప్తే ఆమెను, జైల్లో ఉన్న భర్తను చంపించేస్తానని కాబూల్ బెదిరించాడు.

Rape Images – Browse 136,395 Stock Photos, Vectors, and Video | Adobe Stock

దీంతో ఆమె భయపడిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫీజు కట్టించుకోవాలని కోర్టుకు పిలిపించి.. ఎవరూ లేని సమయం చూసి అక్కడ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. తన వద్ద ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని పబ్లిక్ చేస్తానని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత ఆమెను బలవంతంగా గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త కూడా యువతిని వదిలేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే కాబూల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news