ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్: రాణించిన స్మృతి మంధాన, పూజా వస్త్రాకర్… పాక్ టార్గెట్ 245

-

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. బే ఓవల్ మౌంట్ మాంగనూయి వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 245 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. ఆరంభంతో కాస్త తడబడ్డా… ఓపెనర్ స్మృతి మంధాన బ్రిలియంట్ హాఫ్ సెంచరీతో ఆదుకుంది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ డకౌట్ కావడంతో.. స్మృతి మంధాన, దీప్తి శర్మలు రెండో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్ లు తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. ఆతరువాత లోయర్ ఆర్డర్లో వచ్చిన పూజా వస్త్రాకర్ 67 పరుగులతో, స్నేహ్ రాణా 53 పరుగులతో భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, నష్రా సందు చెరో రెండు వికేట్లు తీసుకున్నారు. దీయనా బేగ్, ఆనం ఆమిన్, ఫాతిమా సనా తలో వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news