Womens Day : ఆర్టీసీలో నేడు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

-

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళ‌ల‌కు తెలంగాణ ఆర్టీసీ వ‌రాలు కురిపించింది. ఏకంగా ఉచిత ప్ర‌యానాన్ని ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ప‌లు ఆఫ‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజీ రెడ్డి గోవ‌ర్డ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్ల పై బ‌డిన మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం ఉంటుంద‌ని వారు ప్ర‌క‌టించారు. ఈ అవ‌కాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంద‌ని తెలిపారు.

మ‌హిళ‌లు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని అన్నారు. అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌హిళా ప్ర‌యాణికుల కోసం ర‌ద్దీ ని బ‌ట్టి ప్ర‌త్యేక ట్రిప్పులను కూడా న‌డ‌పాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ‌స్ స్టాప్ ల‌లో మ‌హిళా వ్యాపారుల‌కు ఉన్న స్టాల్స్ కు దుకాణాల‌కు ఈ నెల 31 వ‌రకు ఎలాంటి ఛార్జీలు తీసుకోమ‌ని ప్ర‌క‌టించారు. పూర్తిగా ఉచితంగా ఈ నెల 31 వ‌ర‌కు స్టాల్స్ ను కేటాయిస్తామ‌ని అన్నారు.

అలాగే ఆస‌క్తి ఉన్న మ‌హిళ‌ల‌కు 30 రోజుల పాటు ఉచితంగా హెవీ మోట‌ర్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తామ‌ని తెలిపారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుంటామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version