WORLD CUP 2023: 2 కీలక మార్పులతో బరిలోకి ఆస్ట్రేలియా !

-

లుకనౌ లోని వాజ్ పేయి స్టేడియం లో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పిచ్ పరిస్థితుల దృష్ట్యా ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఇక జట్టు లో మార్పుల విషయానికి వస్తే రెండు కీలక మార్పులు చేసింది ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం. ఇండియా తో మ్యాచ్ లో కీలక సమయంలో వికెట్ పారేసుకున్న కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీ మీద వేటు పడింది, ఇతని స్థానంలో మరో కీపర్ బ్యాట్స్మన్ జాస్ ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆల్ రౌండర్ గ్రీన్ కూడా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతుండడంతో, ఆస్ట్రేలియా సీనియర్ ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ మీద నమ్మకం ఉంచింది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది..

ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జి కి బదులుగా స్పిన్నర్ శంసి ని ఎంపిక చేసింది. కాగా ఈ పిచ్ మీద సౌత్ ఆఫ్రికా ఏ విధంగా బ్యాటింగ్ చేయనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version