పాకిస్తాన్ లో దారుణం పరిస్థితులు..డబ్బుల్లేక ఇబ్బందులు..

-

పెరుగుతున్న సిలిండర్ ధరల తో జనాలు గగ్గులు పెడుతున్నారు.. ఒక్క ఇండియాలో గ్యాస్ ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర దాదాపు రూ.1,100. ఈ ధర కాస్త పెరిగిందంటేనే జనం గగ్గోలు పెడుతుంటారు. అలాంటిది మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో సిలిండరు ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఒక్కో సిలిండరు ధర రూ.3,652. అంటే భారత్‌లో కంటే మూడురెట్లకు పైగా అధికం. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాక్‌ ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవడానికి. కొంత కాలంగా పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది..ప్రజల మనుగడ కూడా కష్టంగా మారింది.

ఆ దేశ ప్రజలకు గ్యాస్ ను కూడా అందించలేని పరిస్థితిలో వున్నారు. దాంతో అక్కడి ప్రజలు సిలిండర్లు కొనలేక ప్లాస్టిక్‌ సంచుల్లో గ్యాస్‌ను కొంటున్నారు. కరక్‌ జిల్లా ఖైబర్‌ పఖ్తుంఖ్వ ప్రావిన్సు లో ఏర్పడిందీ పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్‌ నింపిన ప్లాస్టిక్‌ సంచుల ను రోడ్డుపై ప్రజలు లాక్కెళ్తునట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంచుల వల్ల జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 8మంది గాయపడినట్లు తెలుస్తుంది..

విద్యుత్తు కొరత వల్ల కొట్టుమిట్టాడుతున్న పాక్‌ దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్‌ను రాత్రి ఎనిమిదన్నరకే మూసివేయించాలని నిర్ణయించింది. కల్యాణ మండపాలకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని ప్రకటించింది.. పాక్ ఇప్పుడు ప్రజలకు ఏం చెయ్యలెము అని చేతులు ఎత్తేశారు.. ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news