పంజాబ్‌లో బీజేపీ నేతలకు సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు బీజేపీ నాయకులకు కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఆ ఐదుగురు బీజేపీ నేతలకు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ జాబితాలో బీజేపీ నేతలు అమ్రీక్ సింగ్ అలివాల్, కాంట్రాక్టర్ హజజిందర్ సింగ్, హరచంద్ కౌర్, ప్రేమ్ మిట్టర్, కమల్ దీప్ సైనీ ఉన్నారు. వీరికి వై కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 11 మంది జవాన్లను కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. ఒకరు లేదా ఇద్దరు కమాండోలు ఒక్కొక్కరికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలోకి చేరారు.