జగన్ వైఖరి సొమ్మొకడిది, సోకొకడిదిలా ఉందని ఫైర్ అయ్యారు యనమల. ఓఎన్జీసి పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం కేంద్రం ఇస్తే.. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదమని.. మత్స్యకారుల పరిహారం 6 నెలలుగా తొక్కిపట్టింది నిజం కాదా..? ఇవ్వాల్సిన దానిలో సగం పెండింగ్ పెట్టింది నిజం కాదా..? అని నిలదీశారు.
దుష్టబుద్ది, వక్రబుద్ది జగనుదేనని.. ఎన్నాళ్లని ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో మీరేం చేశారో చెప్పే ధైర్యం లేదా..? ఈడి, సిబిఐ జప్తు చేసిన రూ 5వేల కోట్ల జగన్ అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడు జమ చేస్తారు..? అని ప్రశ్నించారు.
జగన్ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు జమచేస్తే ఇంత ఆర్ధిక సంక్షోభం ఉండేదా..? సిఎం జగన్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత జగనుకుందా..? ఎంఎస్ఎన్ ట్రస్ట్ ఆస్తులు కూడా వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూడలేదా..అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీడీపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గడం నిజం కాదా..? మత్స్యకారులను కాల్చి చంపిన చరిత్ర వైసిపిదైతే, వారిని ఆదుకున్న ఘనత టీడీపీదన్నారు.