బ‌స్సు యాత్ర స‌క్సెస్ కానీ..!

-

జ‌నం ఎటుచూసినా జ‌నం.. టీడీపీకి జ‌నం..వైసీపీకి జ‌నం..మంత్రుల స‌భ‌కు జ‌నం.. అదేవిధంగా మాజీ ముఖ్య‌మంత్రి స‌భ‌కు జ‌నం.. ఎవ‌రెటు అన్న‌దే క‌న్ ఫ్యూజ‌న్. డ్వాక్రా మ‌హిళా బృందాల సాయంతో బ‌స్సు యాత్ర‌కు సంబంధించిన స‌భ‌లు స‌క్సెస్ అయ్యాయి అని టీడీపీ అంటుంటే, అదేంలేదు త‌మ స‌భ‌ల‌కు స్వ‌చ్ఛందంగానే జ‌నాలు త‌ర‌లివ‌చ్చి, ఆశీర్వాదాలు ఇచ్చార‌ని వైసీపీ అంటోంది. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా బీసీల‌కు జ‌రిగిన మేలు ఎంత‌న్న‌దే ఇప్పుడు ముఖ్యం.

కిటికీ తెరచి చూస్తే కొన్ని నిజాలు అర్థం అవుతాయి. ఆ విధంగా మంత్రులు కొన్ని నిజాలు అంగీకరిస్తూనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వైపు అడుగులు వేస్తేనే రేప‌టి వేళ ఫ‌లితాలు అనుకూలం అవుతాయి అని సోష‌ల్ మీడియా లో ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.మ‌రోవైపు సంక్షేమం అన్న‌ది రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కు అని చెబుతున్న స‌ర్కారు పెద్ద‌లు ఇక‌పై ఆ బాణీలో కొన‌సాగాలంటే అప్పులు చేయ‌క‌త‌ప్ప‌ద‌ని., అప్పుడు ఆర్థిక సంక్షోభం వ‌స్తుంద‌ని మాజీ ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మల రామ‌కృష్ణుడు హెచ్చ‌రిస్తున్నారు. అంటే ఓ వైపు సంక్షేమ ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మే అన్న మాటను మంత్రులు ప్ర‌చారం చేస్తుంటే ఆర్థిక సంబంధిత వివ‌రాల‌కు టీడీపీ విశ్లేష‌ణ ఇస్తోంది.ఈ విధంగా బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా రెండు భిన్న ధ్రువాలు భిన్న వాద‌న‌లు వినిపిస్తూ ఉన్నాయి. మ‌రి! యాత్ర స‌క్సెస్ అయిందా ?

సామాజిక న్యాయం అన్న‌ది వైసీపీతోనే సాధ్యం అన్న మాట ను నిజం చేసేందుకు యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిత‌పిస్తున్నార‌ని మంత్రులు అంటున్నారు. ఇందులో భాగంగానే వీళ్లంతా బ‌స్సు యాత్ర చేప‌ట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యాన్ని చాటింపు వేస్తున్నారు. బీసీల‌కూ మిగ‌తా వ‌ర్గాల‌కూ మేలు చేసిన జ‌గ‌న్ రుణం తాము తీర్చుకోలేమ‌ని అంటున్నారు వీళ్లంతా ! అంటే ప‌దవుల్లో సముచిత, సమున్న‌త స్థానం ఇచ్చిన జ‌గ‌న్ పై తాము మ‌రింత ప్రేమాభిమానాలు పెంచుకుంటున్నామ‌ని అంటున్నారు. శ్రీ‌కాకుళం నుంచి ప్రారంభం అయిన యాత్ర ఆదివారంతో అనంతపురంలో ముగియ‌నుంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ కూడా మ‌హానాడు నిర్వ‌హించింది. అయితే మ‌హానాడు త‌మ‌కు పోటీ కానేకాద‌ని మాజీ మంత్రి పేర్ని నాని తేల్చేశారు. అధికారం ద‌క్కించుకున్న మూడేళ్లలోనే సామాజిక న్యాయం ద‌క్కే విధంగా కృషి చేశామ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version