లక్ష్మీపార్వతి ఎంట్రీ..టీడీపీ టార్గెట్..వైసీపీ లాభం ఉందా?

-

ప్రత్యర్ధులపై రాజకీయంగా విమర్శలు చేయించడంలో వైసీపీ రూటే సెపరేట్ అని చెప్పవచ్చు. ప్రత్యర్ధుల కులాలకు చెందిన వారి చేతే విమర్శలు చేయించడం…దగ్గర వారి చేత విమర్శలు చేయించడం చేస్తూ ఉంటారు. ఇక తాజాగా బాలయ్య..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయనకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వలేదు..కానీ సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీలో పనిచేస్తున్న పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. బాలయ్య సైకో అని, ఆయన గన్ తో ఇద్దరు వ్యక్తులని కాల్చేసారని ఎప్పుడో పాత అంశాలని తెరపైకి తెచ్చారు.

ఇక ఇదే క్రమంలో లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చారు. ఈమె గురించి చెప్పాల్సిన పని లేదు. వైసీపీలో ఉన్న ఈమె..తెలుగు అకాడమీ ఛైర్మన్ గా ఉన్నారు..అదేమంటే అకాడమీకి పూర్వ వైభవం తెస్తానని ఛైర్మన్ అయిన దగ్గర నుంచి చెబుతున్నారు..కానీ అకాడమీ ఏమైందో ఎవరీ తెలియడం లేదు. సరే అది వదిలేస్తే..ఇప్పుడు ఆమె మీడియా ముందుకొచ్చి..యథావిధిగా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేశారు.

Lakshmi-Parvati
Lakshmi-Parvati

చంద్రబాబు సైకో అని… పాపాలు పండిపోయాయని, దుబాయ్, స్విట్జర్లాండ్లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రలో రోజుకో కామెడీ బావుందని, ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అటు బాలయ్య టార్గెట్ గా.. బాలకృష్ణ ఏమి మాట్లాతారో, ఆయన మాట్లాడి ఆరునెలలు అయినా అర్థం కాదని యెద్దేవా చేశారు. పనిలో పనిగా పవన్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చదువుతున్న పుస్తకాలు జ్ఞానం ఎక్కడకి పోయిందని అన్నారు. మొత్తానికి అందరినీ రౌండప్ చేశారు.

అయితే లక్ష్మీపార్వతి..అందరిపై విమర్శలు చేయడం వల్ల వారికి పోయేదేమీ లేదు..అసలు ఆమె మాటలు నమ్మే పరిస్తితి జనానికి లేదు..సొంత పార్టీ వాళ్లే నమ్మడం కష్టం. అసలు ఆమె వల్ల వైసీపీకి ఒక్క ఓటు అదనంగా పడే ఛాన్స్ కూడా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news