SSMB 29 : మహేష్ బాబు కొత్త లుక్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..

-

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు , త్రివిక్రమ్ దర్శకత్వంలో రీసెంట్‌గా వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్టును సాధించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది.మన మిల్క్ హీరో అప్పుడే మరో ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు.దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందుతుంది.

సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో పట్టాలెక్కనుంది.ఈ చిత్రం హలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.ఆ మధ్యలో జిమ్‌లో వర్కవుట్ చేసిన వీడియోలు, ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.ఈ మూవీ తన లుక్ మొత్తం మార్చేసిన మహేశ్.. ట్రెండీ అవుట్ ఫిట్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version