రాణించిన యంగ్ గన్స్.. జింబాబ్వేపై భారత్ విజయం

-

జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 153 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93*), శుభ్మన్ గిల్ (58*) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో రాణించారు. నామమాత్రమైన చివరి మ్యాచ్ రేపు జరగనుంది.

కాగా, మొదటగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే బ్యాటర్లు పర్వాలేదనిపించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 రన్స్ చేసింది. కెప్టెన్ సికందర్ రాజా 46 టాప్ స్కోరర్‌గా నిలవగా.. మారుమణి(32), వెస్లీ మాధవేరే(25) విలువైన పరుగులు చేశారు.భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్,శివం దూబే వికెట్ చొప్పున సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version