Big Boss OTT Telugu: బిందు మాధవికి యంగ్ హీరో మద్దతు.. స్నేహితురాలా? ప్రేమికురాలా?

-

‘బిగ్ బాస్’ ఓటీటీ కంటెస్టెంట్ అయిన బిందుమాధవి తెలుగమ్మాయి. కానీ, తమిళనాట బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు నాట కూడా కొన్ని చిత్రాలు చేసినప్పటికీ కంపారెటివ్ గా ఆమెకు తమిళ్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ అమ్మాయి ప్రజెంట్ ‘బిగ్ బాస్’ 24 బై 7 నాన్ స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్ గా సత్తా చాటుతోంది. ఓటింగ్ లో టాప్ లో ఉంటున్న బిందు..టైటిల్ విన్ అవుతుందని బీబీ లవర్స్ కొందరు అంటున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను బిందు మాధవి చక్కగా పూర్తి చేసిందన్న అభిప్రాయం ఆమె మద్దతు దారుల్లో, బీబీ లవర్స్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు రోజురోజుకూ మద్దతుదారులు పెరుగుతున్నారు. తాజాగా రియాలిటీ షోలో బిందు మాధవి ఆటను సపోర్ట్ చేస్తూ ఓ యంగ్ హీరో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే, ఈ ‘బిగ్ బాస్’ తెలుగు ఓటీటీ షో లో పార్టిసిపేషన్ కంటే ముందర బిందు మాధవి తమిళ్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఆటలో ఆమె కొంత పరిణతి కనిపిస్తున్నట్లు కనబడుతోంది కూడా.

గేమ్ ప్లాన్ లో బిందు మాధవి చక్కటి ప్రతిభ కనబరుస్తుందని అంటున్నారు. ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ ప్రేక్షకుల్లో మెజారిటీ ప్రేక్షకులు బిందు మాధవికే ఓట్లు వేస్తు్న్నట్లు స్పష్టమవుతోంది. కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ బిందు మాధవికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

ఈ క్రమంలోనే వీరిరువురు అనగా బిందు మాధవి- హరీశ్ కల్యాణ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలొస్తు్న్నాయి. బిందు మాధవి తన స్నేహితురాలని హరీశ్ కల్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. కానీ, వీరి మధ్య ప్రేమకథ ఉందని, వీరు ప్రేమికులను నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. వీరి ప్రేమ కథ షో అయిపోగానే ముగియలేదని, షోతో మొదలయి ఇప్పటికీ కొనసాగుతున్నదని అంటున్నారు. ప్రజెంట్ ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news