లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్, పద్మ ల కుమారుడు మని సాయి (19) కి ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2 వేల ర్యాంకు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని స్నేహితుడి రూముకు వచ్చి కౌన్సిలింగ్ కు సిద్ధమవుతున్నాడు. అప్పటికే లోన్ యాప్ లో నుంచి రూ. 10 వేలు తీసుకున్న మని సాయి రూ. 50 వేలు కట్టాడు. అయినా వారి వేదింపులు ఆగకపోవడంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎం పాకెట్ అనే లోన్ యాప్ నుండి అతడు లోన్ తీసుకున్నాడు. శంషాబాద్ లో ఉంటూ రేపు కౌన్సెలింగ్ కి హాజరు కావాల్సి ఉండగా.. ఆత్మహత్య చేసుకున్నాడు మని సాయి విశృత్. తమ ఒక్కదానొక్క కొడుకు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. గత నెల 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా గురువారం మృతి చెందాడు.