నేటి యువత తమ సమయమంతా సోషల్ మీడియాలోనే వృథా చేస్తోంది. కొందరు నెట్టింట వీడియోలు, మీమ్స్, రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తుంటే.. మరికొందరు వీడియోలు, రీల్స్ రూపొందిస్తున్నారు. అయితే కొన్ని రీల్స్ ఉపయోగకరంగా ఉంటుంటే.. మరికొన్ని మాత్రం దారుణంగా ఉంటున్నాయి. రీల్స్ మోజులో చాలా మంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే మరికొందరు మాత్రం రీల్స్ కోసం పిచ్చి చేష్టలు తెస్తూ చిక్కుల్లో పడుతున్నారు. నడిరోడ్డుపై, కదులుతున్న వాహనాలపై వీడియోలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్సై బంధువులు ఏకంగా పోలీసు వాహనాన్ని తీసుకెళ్లి అందులో రీల్స్ చేశారు. పోలీసు కారులో రెండు రౌండ్స్ కొట్టి కొన్ని వీడియోలు, వాహనంలో కూర్చొని మరికొన్ని రీల్స్ చేసి నెట్టింట పోస్టు చేశారు. ఇది కాస్త సీఐ దృష్టికి వెళ్లడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్ళి రీల్స్ చేసిన యువకులు
రీల్స్ మోజులో యువకుల వెర్రి వేషాలు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో పోలీసు వాహనం తీసుకెళ్లి రౌండ్స్ కొట్టిన యువకులు
పోలీస్ వాహనంలో రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఎస్సై బంధువులు
వీడియో వైరల్గా… pic.twitter.com/VdniM5nczB
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2025