కేసీఆర్‌కు జగన్ ఝలక్..!

-

కొత్తగా జాతీయ పార్టీ పెట్టి..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలని కేసీఆర్ రెడీ చేసుకున్నారు..దసరా రోజున పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ని జాతీయ పార్టీగా మార్చనున్నారు..అలాగే దీనికి బీఆర్ఎస్ అని పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితిగా పెడతారని తెలిసింది.

ఇప్పటికే కేసీఆర్ దేశం..బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ పార్టీలకు చెందిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యి..కేంద్రంలో బీజేపీని గద్దె విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ పెట్టి..ఇతర పార్టీలతో కూటమి కట్టి..కేంద్రంలోని మోదీ సర్కార్‌ని గద్దె దించాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్ధులని కూడా పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. అలాగే తమకు అనుకూలమైన పార్టీలతో పొత్తు కూడా పెట్టుకోవాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో జగన్‌తో కేసీఆర్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..దీంతో జగన్‌ని కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలిసింది. జగన్ కూడా కేసీఆర్‌తో కలుస్తారని ఆ మధ్య మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ గురించి వైసీపీ నేతలు స్పందించడం లేదు. అసలు ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీతో వైసీపీ సఖ్యతగా ముందుకెళుతుంది.

అలాంటప్పుడు సడన్‌గా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడానికి జగన్ సిద్ధంగా ఉండరు. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా స్పష్టం చేశారు. తాము ఏ కూటమిలో చేరమని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మాట్లాడారు. దీని బట్టి చూసుకుంటే జగన్ ..కేసీఆర్‌కు మద్ధతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి సన్నిహితుడుగా ఉన్న జగనే..కేసీఆర్‌కు మొదట షాక్ ఇచ్చేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news