నిన్న అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల కాసేపటి క్రితమే బెయిల్ పైన విడుదల అయింది. వచ్చి రాగానే తాను చేసిన తప్పేమిటో ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసింది. ఇక అదే విధంగా ఏ పరిస్థితిలో ఆమె పోలీసును తోయవలసి వచ్చిందో వివరించింది. ఇక ఈమె అధికార పార్టీ అధ్యక్షుడు మరియు సీఎం కేసీఆర్ ను సూటిగా తనదైన తూటాలలాంటి మాటలతో ప్రశ్నించింది. నేను ఏంచేశానని జైలుకు పంపించావ్ కేసీఆర్ అంటూ గదమాయించి అడిగింది. ఎందుకు కేసీఆర్ తనపై పోలీసులు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేయడం లేదు అంటూ ప్రశ్నించింది.
ఆఖరికి తనను జైల్లో పరామర్శించడానికి వచ్చిన తల్లి విజయమ్మపై కూడా ఈ పోలీసులు తమ దౌర్జన్యాన్ని చూపించడం చాలా సిగ్గు చేటు అంటూ బాధపడ్డారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో తాలిబన్ల లాగా ప్రజలను పాలిస్తున్నాడని మాట్లాడారు.