కడుపు మండింది.. అందుకే మోడీకి చుక్కలు చూపించారు : షర్మిల

నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్‌ ను పంజాబ్‌ రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సంఘటన పై వైఎస్‌ షర్మిల సెటైర్లు పేల్చారు. కడుపు మండింది.. అందుకే పంజాబ్‌ లో ప్రధాని మోడీకి చుక్కలు చూపించారని వైఎస్‌ షర్మిల చురకలు అంటించారు. అధికారం ఇస్తే ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచి, రైతుల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కడుపుమండిన రైతన్న ప్రధానమంత్రికి సైతం చుక్కలు చూపించారని…వెనక్కి పంపించారని ఫైర్ అయ్యారు.

Sharmila
Sharmila

తిరగబడ్డ ఈ రైతులే రేపు కేసీఆర్‌ అధికారానికి కర్రుకాల్చి వాత పెడుతారని..హెచ్చరించారు. వరి కొనకుండా రైతుకు చితి పేర్చుతుంటే.. వీధిన పడ్డ రైతుకు అండగా మేము రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతుంటే, ఆపడానికి మీరు కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోవచ్చు కానీ మీ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని మండిపడ్డారు. ఇలాంటి చాతకానీ ముఖ్యమంత్రి మన కొద్దు అంటూ కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.