ముందస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనను బొంద పెట్టడానికి తాము సిద్దమని ప్రకటించారు వైఎస్ షర్మిల. సవాళ్లు, ప్రతి సవాళ్లు తప్పితే కేసీఆర్ గారికి ప్రజాసమస్యలపై పట్టింపు లేదని మండిపడ్డారు.
ఆదివాసీలపై పోలీసుల దౌర్జన్యం, మిషన్ భగీరథ కలుషిత నీళ్లతో చనిపోతున్న జనం, ఇంకా పుస్తకాలు రాని బడులు, జీతాలు రాని ఉద్యోగులు, ఉద్యోగాలు లేని యువత, రక్షణ కరువైన మహిళలు. వీటి మీద నోరు మెదపలేదు.రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించాలని, ముందస్తు,వెనుకస్తూ అంటూ మాట్లాడుతున్నారని ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్నది వాస్తవమని… మీకు భయమైతున్నది వాస్తవన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా మీ నియంత, నిరంకుశ పాలనను బొంద పెట్టడానికి జనం ఎప్పటినుండో రెడీ అన్నారు. 8ఏండ్లుగా టీచర్లను రిక్రూట్ చేసింది లేదు.ప్రమోషన్స్ ఇచ్చింది లేదు.బడులను ఆగం చేయకుండా రాష్ట్రంలో టీచర్ పోస్టులతో పాటు లక్షా 91వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ KCRను డిమాండ్ చేస్తున్నామన్నారు షర్మిల.