ఈ ఏడాది టీటీడీ బడ్జెట్ రూ. 4411 కోట్లు అని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గత నెల 15వ తేదిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని తాజాగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిభందనలు కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చెయ్యలేదని.. 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల అంచనాతో బడ్జేట్ కి ఆమోదం తెలిపినట్లు వివరించారు. శ్రీవారి భక్తులు సౌకర్యర్దం 5.25 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమిళనాడు రాష్ర్టం ఉల్లందురు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా 4 కోట్లు కేటాయించామని.. యస్ జి యస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు 4.71 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.