తిరుమల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులుతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. జనవరి 2 నుంచి 11వ తేది వరకు పదిరోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులును అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలోని 9 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా టోకేన్లు జారి చేస్తామన్నారు. జనవరి 1వ తేదిన టోకేన్లు జారి ప్రకియ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సర్వదర్శనం భక్తులుకు 4.5 లక్షల టోకేన్లు జారి చేస్తామని, టోకేన్ జారి కేంద్రాల వద్ద భక్తులుకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు.
భక్తులుకు నిరంతరాయంగా సమచారం అందించేందుకు తిరుపతి ప్రవేశ మార్గాల వద్ద సిబ్బందిని నియమిస్తామని, డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు చేయడమైందని ఆయన స్పష్టం చేశారు. జననరి 2 మరియు 3వ తేదిలలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశామని తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణ రథం ఉరేగింపు,ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు చక్రస్నాం కార్యక్రమం నిర్వహిస్తామని, పది రోజులు పాటు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 10 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనాని ఉచితంగా కల్పిస్తామన్నారు. పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు.