నేడు గురుపౌర్ణమి.. బాబా ఆలయాల వద్ద భక్తుల రద్దీ..

-

నేడు గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే సాయిబాబు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాబాను దర్శించుకునేందకు ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే.. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు ఆలయ అధికారులు.

A low-key Guru Purnima at Basara- The New Indian Express

విద్యుత్‌ వెలుగు ఆలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నది సాయిబాబా ఆలయం. ఇదిలా ఉంటే. హనుమకొండలోని సాయిబాబా క్షేత్రంలో, కరీంనగర్‌లోని సీతారాంపూర్‌, భాగ్యనగర్‌, సాయినగర్‌ సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా భక్తులు బాబాను దర్శంచుకునేందుకు తరలివస్తుండడంతో సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news