Real Estate : హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో భూములు కొంటే కుబేరులు కావడం పక్కా..!

-

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. అందువల్ల అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న యాచారం, కొంపల్లి, సూరారం, కీసర, జీడిమెట్ల, ఘట్కేసర్, చౌటుప్పల్ వైపు ఉన్న స్థలాల మీద కనుక పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో కచ్చితంగా భారీ లాభాలని సొంతం చేసుకోవచ్చు.

కుబేరులు అయ్యే రేంజ్ లో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని సమాచారం తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరం చుట్టూ కూడా రింగ్‌ రైలు ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది రైల్వే శాఖ. హైదరాబాద్ సిటీ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఎలాగయితే వస్తుందో.. దానికి స్ట్రెయిట్ గా ఈ అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా వస్తుందని సమాచారం తెలుస్తుంది. దాదాపు 564 కి.మీ. రేంజ్ లో ఈ రింగ్‌ రైలు ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం సేకరించిన భూముల్లోనే ఈ అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది జరగనుంది.

రీజనల్ రింగ్ రోడ్ లో బాగా అభివృద్ధి చెందే టౌన్ షిప్ లు మరియు ఇండస్ట్రియల్ జోన్లకు ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకంగా మారనుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రింగ్ రైల్ ప్రాజెక్టులు కూడా పూర్తయితే హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలవడం ఖాయం అని తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులు ఈ రెండూ కూడా చాలా ఏరియాలాని, సిటీలని చేసే ప్రాజెక్టులు.

తెలంగాణ ప్రాంతంలో 40 శాతం దాకా ఈ ప్రాజెక్ట్ అనేది పెరగనుంది. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్ వనంపల్లి, గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నారాయణపూర్, షాద్ నగర్, షాబాద్ ఇంకా అలాగే రామన్నపేట వంటి గ్రామాలను, టౌన్ లను కలుపుతూ ఈ భారీ ప్రాజెక్ట్ జరగనుంది. వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ ఈ అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

తెలంగాణలో అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది భారీ ప్రాజెక్ట్ గా అవ్వనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయ్యిందంటే ఈ ఏరియాల్లో భూములు కొన్నవారు కుబేరులు కావడం పక్కా అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version