Real Estate : తెలంగాణలో ఇక్కడ పెట్టుబడులు పెట్టారంటే కోటీశ్వరులు కావడం పక్కా..

-

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాలు బాగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తెచ్చుకోవడంతో హైదరాబాద్ దగ్గర ఏరియాల్లో పలు అంతర్జాతీయ కంపెనీల కట్టడాలు జరుగుతున్నాయి.

ఇక తెలంగాణాలో ఇప్పుడు చెప్పబోయే ఏరియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ ఏరియానే కొంగరకలాన్. ఎందుకంటే ఈ ఏరియా ఎలక్ట్రానిక్ హబ్ గా మారబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ యాపిల్ కంపెనీకి విడిభాగాలు సప్లై చేసే ఫాక్స్ కాన్ కంపెనీ అభివృద్ధి చెందుతుంది. గత సంవత్సరంలో శంకుస్థాపన చేసిన కంపెనీ ప్లాంట్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.

రెండు, మూడు నెలల్లో ఈ ప్లాంట్ లో ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ కంపెనీలో ఎన్నో లక్ష మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలుస్తుంది. ఈ ఏరియాలో ఈ ఒక్క కంపెనీ మాత్రమే కాదండోయ్.. దీంతో పాటు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా ఒక ప్లాంట్ ని నిర్మిస్తుందని సమాచారం తెలుస్తుంది. ఈ కంపెనీలో ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే సెమీ కండక్టర్లను తయారు చేస్తారు. మొత్తం మీద ఈ ఏరియాలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోటున్నట్లు సమాచారం తెలుస్తుంది.

ఈ కంపెనీలు రావడం వల్ల కొంగరకలాన్ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని.. కోకాపేట, గచ్చి బౌలి ప్రాంతాల లాగే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. పైగా ఈ ఏరియా అవుటర్ రింగ్ రోడ్ కి, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుండడం వంటి కారణాల వల్ల బాగా అభివృద్ధి చెందుతుందని సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం కొంగరకలాన్ లో చదరపు అడుగు స్థలం ధర వచ్చేసి రూ. 3 వేలుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అడుగు స్థలం రూ. 2800గా ఉండేది. కానీ ఏప్రిల్ నెల తర్వాత 3 వేలకు పెరిగింది. రాబోయే రోజుల్లో చదరపు అడుగు స్థలం ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి బాగా అభివృద్ధి చెందనున్న కొంగరకలాన్ లో స్థలాల మీద పెట్టుబడి పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version