‘X’లో మరో మార్పు.. ఆ ఫీచర్​కు టాటా చెప్పిన మస్క్.. గుర్రుమంటున్న యూజర్స్

-

ట్విటర్​ను హస్తగతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో పెను మార్పులు తీసుకొచ్చారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ట్విటర్ లోగో నుంచి సంస్థ పేరును ఎక్స్​గా మార్చడం వరకు చాలా మార్పులు చేశారు. కొత్త ఫీచర్లు రూపొందించడం.. పాత ఫీచర్లకు గుడ్ బై చెప్పడం కూడా చేశారు. ఇక తాజాగా మస్క్ తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం యూజర్లను షాక్​కు గురి చేసింది.

‘ఎక్స్‌’ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్‌ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు మస్క్ ప్రకటించారు. ఆ ఆప్షన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. భద్రతా పరమైన ఫీచర్లలో ముఖ్యమైన బ్లాక్‌ ఫీచర్‌ను తొలగించటంతో యూజర్లు మస్క్‌పై ఫైర్ అవుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ వేధింపులు పెరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ‘టెస్లా ఓనర్‌ సిలకాన్‌ వ్యాలీ’ పేరుతో ఉన్న ఓ యూజర్‌.. బ్లాక్‌ ఫీచర్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ఎలాన్ మస్క్‌ ఈ విధంగా బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version