Oppo Reno 8 Lite 5G: లగ్జరీ స్మార్ట్‌ ఫోన్.. ఫీచర్స్‌ ఇవే..!

-

ఒప్పో నుంచి ఒప్పో రెనో 8 లైట్‌ 5 జీ స్మార్ట్‌ ఫోన్‌ స్పెయిన్‌లో లాంచ్‌ అయింది. ఇప్పటికే ఉన్న Oppo F21 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌కు పలు మార్పులు చేసి ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇది ఒక లగ్జరీ ఫోన్.. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోన్‌ ఫీచర్స్, కాస్ట్‌ ఎంతుందో చూద్దామా..!

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 429 యూరోలుగా (సుమారు రూ.35,700) అందించారు.
బ్లాక్, రెయిన్ బో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 8 లైట్ 5జీ మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా… 33W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా… బరువు 173 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

ఈ ఫోన్‌కు వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news