ఇండియాలో మొదలైన Lenovo Tab P11 Pro సేల్‌..!!

ఇండియాలో లెనోవో ట్యాబ్ పీ11 ప్రో సెకండ్ జెన్ సేల్ ప్రారంభం అయింది. ఈ ట్యాబ్లెట్ ఇటీవలే భారత్‌లో లాంచ్ అయింది. ఇందులో 11.2 అంగుళాల డిస్‌ప్లే, 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీలు కూడా ఉన్నాయి. 14 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది. ఇంకా ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 ధర, సేల్ ..

ఈ ట్యాబ్‌ ధర మనదేశంలో రూ.39,999గా ఉంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో లాంచ్ అయింది.
లెనోవో.కాం, అమెజాన్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
త్వరలో ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో కూడా ఇది అందుబాటులోకి రానుంది.

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

డ్యూయల్ టోన్ డిజైన్ తరహాలో గ్లాస్ తరహా ఫినిష్‌ను ఇందులో అందించారు.
11.2 అంగుళాల సినిమాటిక్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ట్యాబ్‌లో ఉంది.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 2560 x 1536 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 15:9గా ఉంది.
డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్10+ ఫీచర్లను ఎన్‌హేన్స్‌డ్ వీడియో క్వాలిటీ కోసం అందించారు.
ఆక్టాకోర్ మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా అందించారు.
బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే స్టైలస్ పెన్ కూడా ఇందులో ఉండనుంది.
ఆన్ స్క్రీన్ డాక్యుమెంట్స్, మ్యూజిక్, ఇమేజెస్, రికార్డింగ్స్‌ను ఇందులో అందించనున్నారు.
ఆడియో విషయానికి వస్తే… లెనోవో ట్యాబ్ పీ11 ప్రోలో నాలుగు స్పీకర్ల జేబీఎల్ స్పీకర్ సిస్టంను అందించారు.
 డాల్బీ అట్మాస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 8000 ఎంఏహెచ్ కాగా, 14 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనున్నట్లు తెలుస్తోంది.