లాంచ్‌ అయిన Moto E32s స్మార్ట్‌ ఫోన్… రూ. 10వేల లోపే అదిరిపోయే ఫీచర్స్‌

-

మోటో నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. గతంలో విడుదలైన మోటో ఈ32లో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. మోటో ఈ32ఎస్‌గా లాంచ్‌ చేశారు. మరి ఇందలో వచ్చిన మార్పులు ఏంటి, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా.।!

మోటో ఈ32ఎస్ ధర..

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు.
ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది.
మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మోటో ఈ32ఎస్ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఈ32ఎస్ పనిచేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.
మోటో ఈ32ఎస్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా మోటొరోలా అందించింది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news