ఈరోజు రాత్రికి విడుదల కానున్న Apple iPhone 14 సిరీస్‌.. ముందే లీకైన ఫీచర్స్‌..!!  

-

Apple iPhone 14 సిరీస్‌ ఫోన్‌ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఐఫోన్‌ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 7న) రాత్రి 10.30 గంటలకు ఆపిల్ లాంచ్ ఈవెంట్ 2022 అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో Apple iPhone 14 సిరీస్‌ కు సంబంధించి ఫోన్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈవెంట్‌ కంటే ముందే Apple iPhone 14కు సంబంధించి ఓ వీడియో లీక్ అయ్యింది. ఇందులో లేటెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించి చాలా వివరాలు తెలిసిపోయాయి.
ఆకట్టుకుంటున్న డిజైన్..
ఆపిల్ ఐఫోన్ 14కు సంబంధించిన డిజైన్, పరిమాణం కొత్తగా విడుదలైన వీడియోలో స్పష్టంగా తెలిసిపోయింది.. ఫ్రంట్ కెమెరా, ఫేస్ ID ఫీచర్ కోసం రీడిజైన్ చేయబడిన డ్యుయల్ కట్ – అవుట్ డిజైన్ ఆకట్టుకుంటుంది.
రెండు కటౌట్‌ల మధ్య ప్రాంతంలోని పిక్సెల్‌లను బ్లాక్ అవుట్ చేయడానికి ఒక మార్గం ఉన్నట్లు కనిపిస్తోంది.
GSM Arena తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు విషయాలు వెల్లడి అయ్యాయి.
ఆపిల్ చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నది. ఐఫోన్ 14 ప్రో మోడల్‌ ఒకే వెడల్పైన పిల్ ఆకారపు కటౌట్‌ని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.
iOS 14తో రివీల్ అయిన ఈ ఫోన్ లో సరికొత్త ప్రైవసీ ఇండికేషన్స్ పరిచయం చేశారు. ఐఫోన్ 14 కోసం స్టేటస్ బార్‌ను ఆపిల్ పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. ఐఫోన్ డిస్ ప్లే కుడి వైపున పూర్తి బ్యాటరీ సమాచారాన్ని చూపుతుంది.
ఎడమ వైపున, క్యారియర్, నెట్‌వర్క్ సిగ్నల్ గురించిన వివరాలు ఉంటాయి.
8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేసే కెమెరా….
లీకైన వీడియోను బట్టి చూస్తే.. Apple iPhone 14 వెనుక కెమెరా లెన్స్‌లు Apple iPhone 13 Proలో కనిపించే వాటి కంటే పెద్దగా ఉన్నాయి.
Apple iPhone 14 విషయంలో వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాల లెన్స్‌లు పెద్దగా ఉన్నాయి.
పెద్ద కెమెరా లెన్స్‌ల కారణంగా ఐఫోన్ 14 లో ఫ్లాష్, లిడార్ స్కానర్ కూడా కొద్దిగా మార్చారు.
ఐఫోన్ 14 సిరీస్‌లో కెమెరా బంప్ ఉంటుందని వెల్లడించాయి.
Apple iPhone 14 మోడల్‌లు తక్కువ లైటింగ్ లోనూ మంచి ఫోటోలు తీసుకోవచ్చు.
ఇందుకోసం 48 మెగా ఫిక్సెల్ వైడ్ కెమెరాను అందిస్తోంది కంపెనీ.
ఈ స్మార్ట్‌ ఫోన్‌ లు 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news